హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ చిన్ననాటి కోచ్‌‌కు కీలక పదవి

విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కీలక బాధ్యత అప్పగించింది. ఢిల్లీ పురుషుల జట్టుకు ఆయనను మెంటర్‌గా నియమించింది. గతంలో ఆయన ఢిల్లీ జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. దీంతో ఆయనకు ఉన్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని DDCA భావిస్తోంది. కాగా, 2016లో రాజ్ కుమార్ శర్మ ద్రోణాచార్య అవార్డును కూడా అందుకున్నాడు.