హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు కాంస్యం

ఆసియా క్రీడల్లో భారత సీనియర్ అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆమె తన 4వ ప్రయత్నంలో ఇనుప గుండును 17.17 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. చైనా అథ్లెట్లు మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. సాంగ్ జియాయువాన్ (19.40M) స్వర్ణ పతకం సాధించగా, జాంగ్ లిన్రూ (18.14M) రజత పతకం గెలుచుకుంది.