ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. పురుషుల 10,000 మీటర్ల రేసులో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 10 వేల మీటర్ల దూరాన్ని అతడు 28:29.38 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. బిర్హాను బలేవ్ (బహ్రెయిన్) 28:27.51 నిమిషాలతో స్వర్ణం గెలుచున్నాడు. గుల్వీర్ కేవలం 1.87 సెకన్ల తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్నాడు.
క్రీడలు
10వేల మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు రజతం


