KMR: లింగంపేట్ వినాయక నిమజ్జన శోభాయాత్రలో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి యత్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ శుక్రవారం తెలిపారు. దురశెట్టి ఉమేష్, పెద్దపులి నరేష్, పెద్దపులి నవీన్, శెట్టిపల్లి శివసాయి, పంబల వినోద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీసులపై దాడికి యత్నం


