హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తి: మంత్రి

HYD: గణేశ్ నిమజ్జన కార్యక్రమం చివరి రోజును భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నిమజ్జనం త్వరగా పూర్తయ్యేలా నిర్వాహకులు సహకరించాలని కోరారు. రేపు ఉదయానికల్లా నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.