హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూలిన గోడను పరిశీలించిన ఎంపీడీవో

AKP: మాడుగుల మండలం ఎల్‌.పొన్నవోలు పంచాయతీ నర్సయ్యపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రహరీ గోడ కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎంపీడీవో కొంకి అప్పారావు గోడను శుక్రవారం పరిశీలించారు. వాటర్‌ ట్యాంక్‌ మెట్లు శిథిలమయ్యాయని, జలజీవన్‌ మిషన్‌ ద్వారా కొళాయి, పాఠశాల ముందు లైట్లు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎం కోరారు.