SKLM: నందిగాం మండలం జాడ్యాడలో దళితులపై దాడి జరిగి 10 రోజులైనా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టెక్కలి డీఎస్పీకి వినతిపత్రం అందజేసింది. సెప్టెంబర్ 16న జరిగిన దాడిలో నలుగురు గాయపడ్డారని, తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'జాడ్యాడ ఘటనపై కేసు నమోదు చేయాలి'


