SRCL: బైండ్ల కుల వృత్తిదారులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని బైండ్ల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గొట్టే రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా సుధమల్ల జలంధర్ ఎన్నికయ్యారు. సంఘ భవనానికి రెండు ఎకరాల స్థలం, నిధులు కేటాయించాలని, ఇందిరమ్మ ఇళ్లు, పనిముట్లు అందించాలని కోరారు.
తెలంగాణ
'బైండ్ల వృత్తిదారులకు పెన్షన్లు ఇవ్వాలి'


