SKLM: జిల్లాలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ వివేకానంద శుక్రవారం వెల్లడించారు. నడిమివలస జంక్షన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఐదు తులాల బంగారం దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడని, అతనిపై గతంలో సుమారు 110 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్


