ప్రకాశం: సింగరాయకొండలో ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన స్క్రీన్ రాకెట్ వర్క్ షాప్‌లో విద్యార్థులు శుక్రవారం రాకెట్‌ను నిర్మించి విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థుల రూపొందించిన రాకెట్ సుమారు 300 మీటర్ల ఎత్తుకు చేరుకోవడం విశేషం అన్నారు. పుస్తకాల్లోని సైన్సును ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా నేర్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాకెట్‌ను ప్రయోగించిన విద్యార్థులు


