హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్‌పై శిక్షణ'

KNR: కరీంనగర్ జిల్లా పరిషత్‌లో శుక్రవారం వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్‌పై 9 మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలసిరి కింద ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులపై అవగాహన కల్పించారు. గ్రామసభల ద్వారా పనులు గుర్తించి అక్టోబర్ 2న ఆమోదించాలని సూచించారు.