హైదరాబాద్: 28°C
తెలంగాణ

400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు: SP

ASF: కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో సుమారు 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఆరు సెక్టార్లుగా విభజించి ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని శుక్రవారం పేర్కొన్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు బ్రీఫింగ్ ఇచ్చి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.