KRNL: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆదోనిలో బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం బావాజీపేటలో మాజీ కౌన్సిలర్ సురేశ్ ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సమాజంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో దీనదయాళ్ ఉపాధ్యాయకు నివాళి


