KDP: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న కడప శిల్పారామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిపాలన అధికారి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు సిబ్బంది, యువతతో పర్యాటక ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
శిల్పారామంలో పర్యాటక దినోత్సవం..!


