హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండు కుండలా ఒట్టిగెడ్డ

PPM: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో రిజర్వాయర్ నిండుకుండలా మారింది. సామర్థ్యానికి మించి నీరు చేరడంతో అధికారులు శుక్రవారం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో ప్రధాన రహదారిపై ఉన్న కాజ్వేపై వరద నీరు ప్రవహించడంతో సుమారు 38 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.