హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య

TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై మహమ్మద్ వసీం(32) అనే వ్యక్తిని అతని స్నేహితులే కత్తితో పొడిచి చంపేశారు. తమ గంజాయి వ్యాపారం గురించి వసీం పోలీసులకు చెప్పాడని కక్ష పెంచుకుని స్నేహితులు షోయబ్, ఇలియాజ్ హత్య చేశారు.