హైదరాబాద్: 28°C
క్రైమ్

VIDEO: ట్రావెల్స్ బస్సులో మంటలు

TG: HYDలోని కర్మన్‌ఘాట్‌లో ట్రావెల్స్ బస్సులో ప్రమాదం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సకాలంలో సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.