హైదరాబాద్: 28°C
క్రైమ్

ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి

ఢిల్లీలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. దేశబంధు గుప్తా రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు పోలీస్ చౌకీ ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.