కోనసీమ: అమలాపురంలో కరెంట్ మీటర్ సరిచేస్తూ ఎలక్ట్రిషియన్ విద్యుత్ ఘాతంతో మృతిచెందాడు. అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామానికి చెందిన పితాని గౌతమ్ రాజు (22) వనచర్లవీధిలో తన చిన్నాన్న ఇంటి వద్ద మీటర్ పరిశీలిస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా కేసు నమోదు చేసినట్లు అమలాపురం టౌన్ CI వీరబాబు బుధవారం వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్ తో యువకుడు మృతి


