హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సరఫరాకు అంతరాయం

KKD: గొల్లప్రోలు పురపాలక సంఘం పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోవడంతో నీటి సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినట్లు పురపాలక అధికారులు తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు గమనించి సహకరించాలన్నారు.