హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు..పెరిగిన గోదావరి వరద ఉద్ధృతి

E.G: సీతానగరం మండలంలో గోదావరి నది ఉద్ధృతి భారీగా పెరిగింది. వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో లంక గ్రామాలైన మూలకాలంక తదితర ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు నిత్యావసరాల కోసం పడవలపై ప్రయాణిస్తున్నారు. గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.