హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి నితిన్ మృతి చెందాడు. అన్న సిద్ధార్థ్‌ను బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటు వచ్చిన నితిన్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో డ్రైవర్ రవి పాఠశాల బస్సు వదిలి పరారయ్యాడు.