హైదరాబాద్: 28°C
క్రైమ్

ఢిల్లీలో అంతర్జాతీయ సైబర్ మోసం గుట్టురట్టు

ఢిల్లీలో అంతర్జాతీయ సైబర్ మోసం గుట్టురట్టయ్యింది. టెక్ సపోర్ట్ పేరుతో రూ.100 కోట్ల సైబర్ మోసం వెలుగుచూసింది. ఇద్దరు మహిళలు సహా 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.41 లక్షల నగదు, 29 ల్యాప్‌టాప్‌లు, 25 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా పౌరులను బెదిరించి గిఫ్ట్ కార్డులు వసూళ్లు చేసినట్లు గుర్తించారు.