VSP: ఇసుకకొండ శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం భాద్రపద పౌర్ణమి వేడుకలకు సిద్ధమైంది. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరిచి ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటలకు ధ్వజస్తంభ పూజ అనంతరం ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నామని దేవస్థానం ఈవో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భాద్రపద పౌర్ణమికి ఇసుకకొండ ముస్తాబు


