హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హమరా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ

ATP: డా. అంబేద్కర్‌పై 'కల్పిత నాయకుడు' అంటూ పుస్తకం రచించిన తెలంగాణకు చెందిన హమరా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ నాయకులు గురువారం గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ బైనేని శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ విలువలపై దాడేనని, నిందితునిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.