హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RWS అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

VZM: భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు గురువారం RWS విభాగానికి సంబంధించిన ఏఈ, డీఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. అలాగే, తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.