హైదరాబాద్: 28°C
క్రైమ్

చర్లపల్లి జైల్లో ఖైదీ మృతి

TG: హైదరాబాద్‌‌లోని చర్లపల్లి జైల్లో ఖైదీ మృతి చెందాడు. అబ్దుల్ బారీ అనే ఖైదీకి గుండె పోటు రావడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి చెందాడు. ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.