హైదరాబాద్: 28°C
వార్తలు

కనిగిరిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలో టవర్ వర్క్‌ కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కనకపట్నం, రెడ్డి నగర్, కంఫర్ట్ లాడ్జి ప్రాంతం, శంకవరం, చింతలపాలెం ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.