హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాగునీరు, అటవీ సంరక్షణపై సమీక్ష'

KNR: జిల్లాలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు నల్లా కనెక్షన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల శుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణలను అరికట్టి, మైనింగ్‌కు అటవీశాఖ ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.