NDL: పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ ను జిల్లా ఎస్పీ సునీల్ అధికారులతో కలిసి పరిశీలించారు. గోరుకల్లు రిజర్వాయర్ గేట్లు తెరుచుకోవడం వల్ల ఇటీవల ప్రమాద సంఘటన జరిగింది. ఈ ప్రమాద సంఘటనపై జిల్లా ఎస్పీ సునీల్ నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన ఎస్పీ


