హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఘనంగా గణనాథుడి శోభాయాత్ర'

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో శుక్రవారం గంగపుత్రుల ఆధ్వర్యంలో గణనాథుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజుల పూజల అనంతరం ఈరోజు భక్తి, శ్రద్ధలతో వినాయకుడిని సాగనంపారు. మహిళలు, పిల్లలు, పురుషులు కోలాటాలతో శోభాయమానంగా నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం నంది రిజర్వాయర్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.