హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ క్రికెట్‌లో సంచలనం

పురుషుల క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. పసికూన నేపాల్ 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌ను చిత్తు చేసింది. గ్రూప్-A లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 102 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని నేపాల్ 17.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో నేపాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా, AFG అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.