పెరుగులో చక్కెర కలుపుకుని తినడం మన సంప్రదాయంలో భాగం. పరీక్షలు, శుభకార్యాలకు వెళ్లేముందు దీనిని తింటారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది కడుపులో మంటను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే, దీనిని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. మధుమేహం, జలుబు సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మేలు.
ఆరోగ్యం
పెరుగులో చక్కెర కలుపుకుని తింటున్నారా?


