హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫేస్ వాష్, ఫేస్ మాస్క్‌కి మధ్య తేడా తెలుసా?

ఫేస్ వాష్ అనేది చర్మంపై ఉన్న మురికి, నూనె, మృతకణాలను తొలగించి రోజూ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది దైనందిన చర్మ సంరక్షణలో భాగం. ఇక ఫేస్ మాస్క్ అనేది చర్మానికి లోతైన పోషణ, తేమ, కాంతిని అందించే ట్రీట్‌మెంట్ లాంటిది. చర్మ రకాన్ని బట్టి, సమస్యలను బట్టి ఫేస్ మాస్క్‌ను ఎంచుకోవాలి. ఫేస్ వాష్ రోజూ వాడొచ్చు కానీ, మాస్క్ వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వేసుకోవాలి.