హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు రూ. 11.30 కోట్లు మంజూరు

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ. 11.30 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఇందులో హెచ్ఎండీఏ ద్వారా రూ. 10 కోట్లతో 97 పనులు, జడ్పీ ఫండ్ ద్వారా రూ. 30 లక్షలతో 6 పనులు, డిఎంఎఫ్‌టి ద్వారా రూ. 1 కోటి నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.