హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AUS: ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్

ఆస్ట్రేలియా-Aతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్-A జట్టు ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 200 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో కంగారూ జట్టును ఏకంగా 162 పరుగుల భారీ తేడాతో భారత్ మట్టికరిపించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో పడిక్కల్ సేన్ ఆధిక్యంలోకి వెళ్లింది.