హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందబొగుడలో ఘనంగా పోషణ మాసం వేడుకలు

ADB: బోథ్ మండలంలోని మంద బొగడ గ్రామంలో పోషణ మాసం వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, అంగన్‌వాడీ పిల్లలు తీసుకోవాల్సిన పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు. గర్భిణీలు, చిన్నారులు రోజువారి ఆహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ సంకాబాయి సూచించారు. సర్పంచ్ బాబూలాల్, గ్రామస్తులు తదితరులున్నారు.