MDCL: నాగారం డివిజన్‌లోని రాంపల్లి లేక్ వద్ద గణేశ్ నిమజ్జనాలకు తరలివచ్చే భక్తులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు HMWSSB అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మల్కాజ్‌గిరి ED పంకజ ఆదేశాల మేరకు ఉచిత మంచినీటి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఈ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వార్డ్ మేనేజర్ సాయికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రాంపల్లి లేక్ వద్ద ఉచిత మంచినీటి సదుపాయం


