హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేశవ నగర్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని కేశవనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. దొంగతనాల నివారణ, ప్రజల భద్రత కోసం బీజేపీ నాయకులు, కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు మహిళలు, చిన్నారులకు భద్రత చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు .