హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బెల్లంపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం

MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో బజార్ ఏరియాలోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు వార్డుల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్, శిశుమందిర్ రోడ్డు వద్ద, యూనియన్ బ్యాంక్ ఎదుట పెద్దఎత్తున నీరు నిలిచి,వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.