హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరం

WGL: పర్వతగిరి మండలంలోని 1 నుంచి 18 సంవత్సరాల లోపు అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందుకు ఈనెల 26న వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుర్తింపు, నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు MEO బిక్షపతి తెలిపారు. శిబిరానికి వచ్చే వారు సదరమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, UDID కార్డు జిరాక్సులు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలని సూచించారు.