NGKL: అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రయోజకులు గా తీర్చిదిద్దాలని పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే


