హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సర్పంచుల సామర్థ్యాభివృద్ధిపై సమీక్ష

BHPL: చిట్యాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల 26న శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సర్పంచుల సామర్థ్యాభివృద్ధి, గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయశ్రీ తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హాజరుకానున్నారు. మండలస్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఆమె కోరారు.