BDK: మణుగూరులో కురుస్తున్న వర్షాలకు రధం గుట్ట ప్రకృతి సోయగాలతో పరవశిస్తోంది. గుట్టపై నుంచి జాలువారుతున్న వర్షపు జలధారలు జలపాతాలుగా మారి భూమిని ముద్దాడుతున్నాయి. గుట్ట అంచుల నుంచి వెండి తెరలా కిందికి జారుతున్న నీటి ప్రవాహాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. చుట్టూ పచ్చదనం మధ్యలో జలధారల సవ్వడి వర్షపు చినుకులతో రధం గుట్ట సరికొత్త అందాలను సంతరించుకుంది.
తెలంగాణ
జాలువారుతున్న వర్షపు జలధారలు


