ASF: సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామంలో కురిసిన వర్షానికి తివాడే ప్రకాశ్‌కు చెందిన ఇంటి గోడ ఇవాళ కూలిపోయింది. వర్షానికి గోడ నానిపోవడంతో బలహీనమై కూలినట్లు స్థానికులు తెలిపారు. గోడ కూలడంతో రోడ్డున పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఇంటి గోడ కూలీ రోడ్డున పడ్డాం.. ఆదుకోండి సార్లు


