హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈసీ తీరును నిరసిస్తూ ఈనెల 28న ఆందోళనలు

ASF: ఎన్నికల కమిషన్ వ్యవహార తీరుపై నిరసనగా AICC, TPCC పిలుపు మేరకు ఈ నెల 28న జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేపడుతున్నట్లు DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇవాళ తెలిపారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, డేటాబేస్, సాఫ్ట్‌వేర్ అంశాలపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజా సంఘాలు ఆందోళనకు మద్దతు ఇవ్వాలన్నారు.