హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు

SRD: సదాశివపేట మున్సిపాలిటీలో నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శివాజీ హెచ్చరించారు. వ్యాపారులు జూట్ బ్యాగులను మాత్రమే వాడాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలిథిన్ కవర్ల కోసం ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు కూడా మార్కెట్‌కు వెళ్ళినప్పుడు జూట్ బ్యాగులను వాడాలని సూచించారు.