హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మత్తడి దూకుతున్న తోటపల్లి రిజర్వాయర్

SDPT: బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌ వరుస వర్షాలతో నిండుకుండలా మారి మత్తడి దూకుతోంది. జలాశయం నిండడంతో పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. చెరువులో నీరు సమృద్ధిగా చేరడంతో భూగర్భ జలాలు పెరిగి సాగుకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి లభ్యత మెరుగుపడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.