హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి'

WGL: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ వెంకన్న ఆదేశించారు. ఇంజినీరింగ్‌, శానిటేషన్‌, డీఆర్‌ఎఫ్‌ విభాగాలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.