హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ఢీ కొని విద్యార్థి మృతి

MDK: చిన్న శంకరంపేట్ మండలం జంగరాయి గ్రామంలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల చిన్నారి బొమ్మరబోయిన కీర్తన మృతి చెందింది. చిన్న శంకరంపేట్‌లోని సరస్వతి విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. బస్సు దిగి వెళ్తున్న చిన్నారిని గమనించకుండా డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో.. టైర్ తగిలి పాప తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప మృతి చెందింది.